Wednesday, December 26, 2012

ఏం చెప్పాలి.............???????????


ఈ పిల్లలున్నారే .......................!! ఒక్కోసారి తెగ ముద్దోచ్చేస్తారు. వాళ్ళ మాటలు ఎంత ముద్దుగా  ఉండి మురిపిస్తాయో , ఇంకోసారి అంతే విసిగించేస్తారు.  చిన్నప్పుడు ఆ వచ్చీ రాని మాటలు వింటుంటే ఎంతో అబ్బుర పడిపోయి మళ్లీ మళ్లీ వినాలి అని తెగ ముచ్చట పడిపోతూఉంటాము .  కానీ వాళ్ళు పెద్దయ్యేకొద్దీ వారి మాటలు కొన్నిసార్లు చాలా ఆందోళన కలిగిస్తాయి. భవిష్యత్తులో వీరేమైపోతారా అన్న దిగులు కూడా పుడుతుంది.

అదంతా సరేకానీ ఈ సోదంతా మాకెందుకు  చెప్తున్నావు?????????????? అని అనుకుంటున్నారా .............??
వస్తున్నా , వస్తున్నా అక్కడికే వస్తున్నా...

ఏమీ లేదండీ, నా అదృష్టం పుచ్చిపోయి, నక్కని, పిల్లిని, కుక్కని అన్నింటిని ఏకకాలం లో తోక్కేసానేమో (???!!!!) నిన్న ఆఫీసులో పని కాస్త తక్కువగా ఉండటం వల్ల సాయంత్రం 3.30కే ఆఫీసు నుండి బయట పడ్డాను.  ఓ మూడు నెలల తరువాత అనుకుంటా ఇలా వెలుతురు ఉండగానే ఆఫీసు నుండి బయటకు రావడం.


 ఇంటికి వచ్చీ రాగానే పక్కింట్లో పిల్లలు, మిద్దె మీది పిల్లలు అందరు ఆంటీ నువ్వు ఈ రోజు త్వరగా వచ్చేసావుగా అయితే మాతో ఆడుకోవాలి ఇవ్వాళ అని మొదలెట్టారు. ఒకటి నుండి పది క్లాసుల మధ్యలో ఓ ఐదు మంది పిల్లలు వీళ్ళు. సరే అయితే ముందు మనం కాసేపు చదువుకుందాం తరువాత ఆడుకుందాం అని చెప్పి నాలోని ఒక టీచర్ ని , ఒక మెంటర్ ని, అందరిని మేల్కొలిపే ప్రయత్నం చేసాను.

4th class పిల్లతో ముచ్చట్లు:

 "ఇది ఏంటి?"   మావిడి చెట్టు.
 మరి దీని పండ్ల పేరేంటి?  "మామిడి పండ్లు"  ఓ గుడ్ మరైతే ఇప్పుడు చెప్పు, మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి?
"ఏమో తెలియదు ఆంటీ"  అదేంటే ఇప్పుడేగా చెప్పావు, మామిడి చెట్టుకి మామిడి పండ్లు వస్తాయి అని, మరి మామిడి పండ్లు ఏ చెట్టుకి కాస్తాయి అంటే తెలియదు అంటావే?
"మామిడి చెట్టుకి మామిడి పండ్లు కాస్తాయి అని మా టీచర్ చెప్పింది ఆంటీ, కానీ మామిడి పండ్లు ఏ  చెట్టుకి వస్తాయో చెప్పలేదు "

ఒక్కసారి గా మైండ్ బ్లాక్ అవ్వడం అంటే ఏంటో అప్పుడు తెలిసింది. నా పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి "స్వాతీ .... దీన్ని ఇంకేమి అడక్కు, దీని నెత్తిన నేను  పెట్టిన యాభై వేలు గిర్రున తిరుగుతున్నాయి. దీని నోటినుండి ఇంకేమి వినాల్సి వస్తుందో అన్న టెన్షన్ కే నాకు కళ్ళు తిరుగుతున్నాయి" అంది.

9th class పిల్లతో ముచ్చట్లు:

ఏ శ్రావ్య, నువ్వు చెప్పు, నీకు లెటర్ రైటింగ్ ఉంది కదా? "ఆ ఉంది అక్కా" అయతే చెప్పు, PIN అంటే ఏంటి? "లెటర్ రైటింగ్ లో PIN ఏంటి అక్కా?"  సరే అయితే మన ఇంటి పోస్టల్ అడ్రస్ చెప్పు. "...........,............, .........., -01"  హ్మ్మ్ ఇప్పుడు 01 అన్నావు కదా ఆ  నెంబర్ ఏంటి? "అంటే అక్క, ప్రతి అడ్రస్ తరువాత అలా ఒక నెంబర్ రాయాలి. కాని అది ఎందుకో తెలియదు"
PIN అంటే Postal Index Number.  టెక్స్ట్ బుక్స్ కి ఫస్ట్ లో ఇస్తారు కదా ఒక్కో చాప్టర్ ని, లెసెన్ ని గుర్తు పట్టడానికి ఇండెక్స్, అలా పోస్టల్ డిపార్టుమెంటు వాళ్ళు మనం రాసిన అడ్రస్ సులభం గా గుర్తు పట్టడానికి, ఒక్కో ఊరికి, ఒక్కో PIN అలాట్ చేసారన్నమాట.
"మాకు ఇవేమీ చెప్పలేదక్కా మా టీచరు"  పోనిలే అయితే ఒక లెటర్ ని ఎన్ని విధాలుగా పంపవచ్చు?
"అంటే అక్కా మాకు లెటర్ రైటింగ్ ఒక్కటే చెప్పరక్కా, అది ఎలా పోస్ట్ చేయాలో చెప్పలేదు".
వాళ్ళు చెప్పకపోయినా నువ్వు తెలుసుకోవాలి కదా. రేపు నీకు జాబ్ వచ్చిన తరువాత ఇలా లెటర్ పంపడం రాదు అంటే ఎలా?
"జాబ్ జాయిన్ అయ్యాక నేను ఓన్లీ లెటర్ రాస్తాను అంతే కాదక్కా, పోస్ట్ చేయడానికి ఆఫీసు బాయ్ ఉంటాడు గా?"

వారెవ్వా వాట్ ఎన్ ఆన్సర్ సర్జీ అనుకుని, నా చిన్నప్పుడు నాకింత తెలివి లేదే అని నన్ను నేనే తిట్టేసుకుంటూ నేనెంత అజ్ఞానం లో ఉన్నానో తెలుసుకుంటున్న తరుణం లో వచ్చింది ఇంకో ఇంట్లోని U.K.G చదివే పిల్లది. అది రావడం తోనే,

"ఆంటీ ఆంటీ, మేము ఇవ్వాళ లైఫ్ గేమ్ ఆడాము తెలుసా?"  ఓహ్ అవునా గుడ్.
"తెలుసా ఆంటీ, నాకేమో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అని వచ్చింది, తరువాత మ్యారేజ్ ఆ తరువాత 3 చిల్ద్రెన్"
ఓహ్ గుడ్.
"ఈ అక్కకేమో ఎంగేజ్మెంట్ అవ్వకుండానే మ్యారేజ్ వచ్చింది డైరెక్ట్ గా" ఓహ్ అవునా.
"మరేమో శ్రావ్య అక్కకి ఎంగేజ్మెంట్ కాలేదు, మ్యారేజ్ లేదు, ట్విన్స్ వచ్చారు ఆంటీ" గుడ్ కదా.
"అది కాదాంటి ఎంగేజ్మెంట్, మ్యారేజ్ రాకుండానే ట్విన్స్ ఆంటీ"  చెప్పావు కాదే ఇప్పుడే, మళ్ళి చెప్తావే?
"అది కాదాంటి, ఎంగేజ్మెంట్ అవ్వక పోయినా పర్లేదు కానీ మ్యారేజ్ అవ్వకుండానే పిల్లలు పుట్టారు అంటే తప్పు కదాంటి" అంది పక్కన పిల్లని చూసి ముసిముసి గా నవ్వుతూ

మై గాడ్ ........................ ఏంటిది? నేను వింటున్న మాటలు !!!!!!!!!!!!!!!! అంత చిన్న పిల్ల .......
ఎవరు నేర్పిస్తున్నారు వీళ్ళకి ఈ మాటలు?  అసలు తప్పొప్పులు అంటే ఏంటో తెలిసే వయసేన అది?  అసలేమనుకోవాలి వీళ్ళని? ఎటు పోతున్నాయి వీళ్ళ ఆలోచనలు? ముందు చెప్పిన ఇద్దరు పిల్లల్ని చూసి వీళ్ళు అమాయకులు అనుకోవాలా? లేక తరువాతి పిల్లని చూసి ముదుర్లు అనుకోవాలా?

ఎందుకో మనస్సంత కేలికినట్టు ఏదో తెలియని బాధ. ఏమిటి ఈ పిల్లల భవిష్యత్తు?


7 comments:

  1. స్వాతిశంకర్ గారు..
    ఇప్పటి పిల్లల ఐక్యూ వాళ్ల చురుకుదనం కొన్నిసార్లు చూస్తే ముచ్చటగా ఉంటుంది. ఇంకొన్ని సార్లూ వీళ్లకి ఇన్ని విషయాలు ఎలా తెలుసో అని అనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. Chinni gaaru,
      veella IQ sangathemo kaani, veella nundi eppudu emi vinalsosthundo ani bhayamesthondandi.
      Thanks for the comment.

      Delete
  2. :)))))))... లైఫ్ గేం గురించి నో కమెంట్స్ అండీ ;)

    ఇక లెటర్స్ గురించి చదవగానే నాకొకటీ గుర్తొచ్చింది. మా నాన్నగారు వేరే ఊళ్ళో స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయ్యాక, పాత స్కూల్ నుండి ఒకే రోజు యాభై కి పైగా ఉత్తరాలొచ్చాయి. అన్నింటిలోనూ మేటర్ ఒకటే. విషయం ఏంటంటే నాలుగో తరగతి పిల్లలకి వాళ్ళకి లెటర్ రాయడం నేర్పిస్తూ అడ్రస్ మా అడ్రస్ ఇచ్చారంట ఆ మాష్టారు ;) ;)

    నైస్ పోస్ట్ అండీ

    ReplyDelete
    Replies
    1. రాజ్ కుమార్ గారు, :)) 50 ఉత్తరాల?!!!! బాగుందండి.

      Delete
  3. Pillalalito prateevallaki ee expwrience lu untayi kada

    ReplyDelete
  4. Pillalalito prateevallaki ee expwrience lu untayi kada

    ReplyDelete
  5. Life game evaru enudku ela nerpincharo gani, no comments :)

    mee rase saili bavundi swathi garu.. keep it up

    ReplyDelete