Thursday, February 6, 2014

మాట......ఓ మాట ......!!!!!!

మాట......ఓ మాట ......
ఎంత శక్తిమంతమే నీవు!!!!
ఎంత విలువే నీకు.....

వేదన నిండిన మనసుకు సాంత్వన నీవు
ఒంటరితనం పారద్రోలు ఆత్మీయత నీవు
ఇరు హృదయాల మధ్య ప్రేమవు నీవు
అలసిన మనసుకు ఊరట నీవు
మనుషుల మధ్యన కుసుమించే స్నేహం నీవు

మాట......ఓ మాట.....
ఎంత శక్తిమంతమే నీవు!!!!!!
ఎంత టక్కరితనమే నీకు........

మనసును గుచ్చే ముల్లువి నీవు
దూరం పెంచే వైరం నీవు
ప్రాణ మిత్రుల మధ్యన అగాధం సృష్టిస్తావు 
ఆత్మీయులను సైతం విరోధులుగ మారుస్తావు

మాట.....ఓ మాట
ఎంత శక్తిమంతమే నీవు!!!!!!!!!!