Thursday, July 8, 2010

విజయనగర సామ్రాజ్య పాలకుల వంశవృక్షం

హంపీ లోని విరూపాక్ష దేవాలయం లో ఉన్న విజయనగర సామ్రాజ్య మ్యాప్ మరియు విజయనగర రాజుల వంశ వృక్షం  ఫోటోలు మీకోసం....వంశవృక్షం ఫోటో లో విజయనగర సామ్రాజ్య రాజముద్ర ను సైతం చూడవచ్చు.  


Friday, January 15, 2010

నాతూ వాతలు తావాలి.......వా :(((((((((((((


"వాతలు"...ఇవంటే నాకు చిన్నప్పుడు ఎంత ఇష్టమో!...అడిగి మరీ వాతలు పెట్టించుకునేదాన్ని. ఏ రోజైనా వాతలు లేకపోతే ఇంట్లో మూడో ప్రపంచయుద్ధం సృష్టించేదాన్నట. ఇంతకీ అసలు సంగతేంటంటే...అది నాకు మాటలు కూడా సరిగ్గా రాని వయసు. మా నాన్నారు రోజూ ఆఫీసు నుంచి రాత్రి ఇంటికొస్తూ నాకోసం పాలకోవా తీసుకొచ్చేవారు. ఆయన రావడం ఎంత లేటయినా వెయిట్ చేసి మరీ అవి తీసుకుని తింటే గానే నిద్రపోయేదాన్ని కాదట. ఒకరోజు అలాగే మా నాన్న తెచ్చిన పాలకోవా తింటూ అరుగుమీద కూర్చుని ఉండగా ఎదురింటి అక్క ఏం తింటున్నవ్ అని అడిగింది. నాకేమో దాని పేరు కూడా తెలియదు...అందుకనే చేతిలో పాలకోవా బిళ్ళ చూపించి "ఇది తిన్తుతున్నా" అని చెప్పాను. అప్పుడు ఆ నన్ను ఏడిపించడానికి "దాన్ని వాతలు అంటారు...ఇక నుంచి ఎవరయినా అడిగితే అలానే చెప్పు అంది" నాకేం తెలుసు కామోసు అనుకున్నా. ఇహ చూస్కోండి అక్కడనుంచి రోజూ మా నాన్న రాగానే నాన్న వాతలు తీచుకోచ్చావా? అని అడగడం ఇంట్లో వాళ్ళు నవ్వుకోడం మామూలయిపోయింది. 

ఒక రోజు మా నాన్న రోజూలా రాత్రి కాక సాయంత్రమే ఇంటికొచ్చి రాత్రి ఇంటికి గెస్ట్ లు వస్తున్నారు. శనివారమే కదా టిఫిన్ చేసేయి అని మా అమ్మతో చెప్పి బజారుకి వెళ్ళారు. అక్కడే ఉన్న నాకు పే....ద్ద అవమానం జరిగినట్టు అనిపించింది. ఆఫీసు నుంచి వచ్చిన నాన్న "వాతలు" తీసుకురాకుండా రావడం నాకు నచ్చలేదు. ఇంక చూస్కోండి ఆరున్నొక్క రాగం లో నా నిరసన తెలియజేస్తూ మా అమ్మ దగ్గరికి వెళ్లి "అమ్మా.. నాన్న నాతు వాతలు తేలేదు. నాతు వాతలు తావాలి....' అని మొదలు పెట్టాను. మా అమ్మేమో ఒక పక్క అతిథులోస్తున్నారని చపాతీలు చేస్తూ బిజీగా ఉంటే పక్కనుంచి నా గోల ఒకటి. ఒకటి రెండు సార్లు చెప్పి చూసింది.. ఊహు నేను వింటేనా "నాతు వాతలు తావాలీ..." అంటూ ఒకటే ఏడుపు. విసిగిపోయిందా అమ్మ చేతిలో అట్లకాడ చూపించి వాతలు కావాలా? అని కోపంగా చూపించింది. అదే సమయంలో నేను అమ్మ చేయ్యిలాగడం ఆ అట్లకాడ నా చేతికి తగిలి "నిజం వాత" పడటం జరిగిపోయాయి. ఇంక చూసుకోండి...మా వీధి మొత్తం వినబడేలా ఏడుపు మొదలెట్టేసాను. నా హడావుడికి ఎదురింట్లో ఉండే మామ్మగారు, అత్తయ్యలు, అక్కలు అంతా వచ్చ్చేసారు. వీధి వీధంతా ఏం జరిగిందో అని మా ఇంటిముందే...అప్పుడే బజారు నించి వస్తూ దార్లో కనబడ్డ గెస్టు లతో ఇంటికి చేరుకున్న మా నాన్నకు ఈ హడావుడి ఏమి అర్ధం కాలేదు. ఇంతలో నన్ను ఎత్తుకుని సముదాయిస్తున్న ఎదురింటి మామ్మగారు మా నాన్నతో ఫిర్యాదు చేస్తున్నా స్టైల్ లో "చూడు చిన్నపిల్ల తెలియక అడిగితే ఎలా వాత  పెట్టిందో.."అనగానే అంత సేపూ ఏడుస్తున్న నేను సడెన్గా ఏడుపు ఆపి "ఎక్కల పెట్టిందీ? నాతు వాతలు పెట్టలేదు ...నాతు వాతలు తావాలి...." అంటూ మళ్లీ మొదలెట్టాను. ఒక్కసారిగా అంతా నవ్వడం మొదలుపెట్టారు...నాకేమో వాళ్ళెందుకు నవ్వుతున్నారో తెలియదు...ఇంతలో మానాన్న బజారు నించి తెచ్చిన పాలకోవా నా చేతికి ఇవ్వడంతో  నేను మామ్మగారి చేతుల్లోంచి ఒక్కసారిగా కిందకి దూకినంత పనిచేసి మా నాన్న చేతుల్లో ఉన్న ప్యాకెట్ మొత్తం లాక్కుని "అన్ని వాతలూ నాతే తావాలి" అనడం తో నా చుట్టూ ఉన్న పెద్దాల్లందరూ మళ్లీ నవ్వడం మొదలెట్టారు. ఎవరు నవ్వితే నాకేంటి నా వాతలు నాకు దొరికాయి అనుకుంటూ నేనూ హేప్పీసు.!!

అదండీ నా వాతల ప్రహసనం.  

Monday, January 11, 2010

ప్రపంచ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక కనీ వినీ ఎరుగని అద్భుతం

ప్రపంచ బ్లాగ్ చరిత్రలో నేడు ఒక కనీ వినీ ఎరుగని అద్భుతం జరిగింది. రాబోయే రోజుల్లో కొన్ని వందల కోట్ల మంది రోజూ సందర్శించే ఒక వినూత్న, వైవిధ్యభరిత, అపూర్వ బ్లాగ్ కు నేడు శ్రీకారం చుట్టబడింది. ఎన్నో సంచలనాలకు, విప్లవాత్మక మార్పులకు కారణం కానున్న ఒక  బ్లాగ్ మన భారత దేశం నుంచి అదీ తెలుగు భాషలో ప్రారంభం కావడం నిజంగా తెలుగువారి పూర్వజన్మ సుకృతం.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
.
.బిల్డప్ బాగా ఎక్కువైనట్టుంది కదా !...మరేం లేదండి. మొదటి సారి బ్లాగ్ స్టార్ట్ చేస్తూ అందులో మొదటి పోస్ట్ గా బ్లాగ్ ఇంట్రడక్షన్ రాద్దామనుకున్నా. సర్లే కుసింత గ్రాండ్ గా ఉంటుందని ఇలా రాసానన్నమాట. పైన చెప్పినవాటిలో ఏ ఒక్కటీ ఈ బ్లాగ్ లో ఉండకపోవచ్చు. కానీ ఇది నాకు చెప్పలనిపించినవన్నీ....మీలాంటి మంచి ఫ్రెండ్స్ తో పంచుకునేందుకు చేసే ఓ చిన్ని ప్రయత్నం అన్నమాట. (బాగా చెప్పా కదా !!!! శభాష్... శభాష్...)

సో ...ఇక నుండి చూస్తూనే ఉండండి నిరంతర నా గోల స్రవంతి... ఎందుకంటే నేను చెప్పాల్సింది చాలా ఉంది..మీరు చదవాల్సింది మిగిలే ఉంది .

(ఇంట్రడక్షన్ నచ్చితే మెచ్చుకుంటూ కామెంట్ చేయడానికి వెనకాడకండి... )