మూడు ముళ్ళ బంధం,
ఏడడుగుల బంధం,
ఏడు జన్మల బంధం
వేద మంత్రాల తోడుగా,
అగ్నియే సాక్షిగా,
ఒక్కటైనదీ బంధం.
తోడూ నీడగా
నీడే తానుగా
తానే నీవుగా
నిలచినదీ బంధం.
నీవు నేనన్నది
తెలియనిదీ బంధం,
నీవే నేనై నిలచిన
ఆలోచనా తరంగం.
పంచ భూతాలెదురైన
చెదిరిపోనిదీ బంధం.
ఈ జన్మలోనే కాదు,
ఏడేడు జన్మలకు
తోడై నిలుచును ఈ బంధం.
తోడూ నీడగా
ReplyDeleteనీడే తానుగా
తానే నీవుగా
నిలచినదీ బంధం
బాగుంది.
baagundi edu janmala kaa...!! :)
ReplyDeleteబావుంది స్వాతి గారు.
ReplyDeleteBavundi swathi garu.. barya barthala bandham gurunchi baga rasaru
ReplyDeleteNagarjuna garu, Cheppalante.........garu, Jyothirmaye garu, Anonymous garu, Dhanyavaadalu.
ReplyDeletegood bavundi
ReplyDelete