Tuesday, September 25, 2012

సరదా కబుర్లు


           ఆలో ఆలో ఆలో ... అందరు బాగున్నారా. అందరికి శుభోదయం. ఉభయ కుసలోపరి.  ఏంటో ఈమధ్య తెలుగు మీద ప్రేమ పొంగిపోతోంది. అయిన ఈమధ్య అని ఏముందిలెండి, నేను చిన్నప్పటి నుండి ఇంతే.  నా స్నేహితులు అందరిలోకి నేనే తెలుగు బాగా మాట్లాడతాను. నేనో తెలుగు భాషాభిమానిని. తెలుగు భాష మీద నాకు మంచి పట్టు ఉంది అని నా మీద నాకు మాచెడ్డ నమ్మకం. మీకు తెలుసా? మా స్నేహితులెవరి పుట్టినరోజైన నేను చక్కగా తెలుగులోనే "జన్మదిన శుభాకాంక్షలు" అని చెప్తాను. వాళ్ళంతా ఎంత సంతోషిస్తారో!
         ఇంత బాగా తెలుగు మాట్లాడే నాకు ఏంటో ఈమధ్య అన్ని అనుమానాలు ఎక్కువైపోయాయి. అసలు నేను మాట్లాడేది తెలుగేన? కాదా? కాకపోతే మరి ఇది ఈ భాష?  ఏమో బాబు నాకు అంత అయోమయంగా ఉంది.  మీరే చెప్పండి. ఇప్పటివరకు నేను మాట్లాడింది అంత తెలుగే కదా. మరి వాడేంటి అలా అంటాడు. పకపక నవ్వేసి "నీ తెలుగు తెల్లారినట్టే ఉంది". జన్మదిన శుభాకాంక్షలు అనేది తెలుగు కాదు తెలుసా నీకు?  అబ్బ ఛా. మరి తెలుగు కాకపోతే ఇంకేంటో. నేను చిన్నప్పటినుండి వింటున్నాను. నాకే చెప్తావ? నిజంగానే. అది సంస్కృతం. అంత లేదు. తెలియకపోతే తెలుసుకో.  నాకే తెలుగు నేర్పిస్తావ? శుభోదయం, శుభాకాంక్షలు, ఇవన్ని తెలుగు  పదాలే. కాదు. కావాలంటే "I will Prove".
       (ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు, వీడు చెప్పేది నిజమేనా? అయిన సరే తగ్గకూడదు.) అని మనసులో అనేసుకుని, "ఆ హా ! మరి అయితే చెప్పు, శుభోదయం ని తెలుగులో ఏమంటారు?" మేలు పొద్దు అంటారు.  మరి సుభాకాంక్షాలని? మేలు తలపులు.  ఓస్ ఇంతేన. ఆమాత్రం అన్వాదాలు మేము చేయగలం. నీ గోప్పెంటి?  ఆ ఆ చెయ్యమ్మా చెయ్యి. ఆ అనువాదాలు విన్న వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు.
       (అవమానం. ఘూర అవమానం. లాభం లేదు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి) చూద్దాం కాని.  నువ్వు ఏదన్న సంస్కృతం లో చెప్పు, నేను తెలుగు అనువాదం చెప్తాను. అయితే చెప్పు, "కిం కుర్వతి సంజయ"  దీన్ని తెలుగులో చెప్పు.  ఇదేంటి? సంస్క్రతం.  అబ్బ అది కాదు, ఇది అక్కడ ఉంది? ఈ లైను?  అవన్నీ నీకెందుకు? ఏమో ఇది నాకు తెలియదు.  నవ్వే చెప్పు. సరే విను. కిం అంటే ఏమి.  కుర్వతి అంటే కూర వండావు.  అంటే ఏమి కూర వండావు సంజయ అని అర్ధం. ఓహో అవునా!(అమాయకంగా మొహం పెట్టి). పక్కన కిందపడి దోర్లేసి దోర్లేసి నవ్వ్తు, ఈ అనువాదాన్ని నమ్మావు అంటేనే తెలుస్తోంది నీ తెలుగు ఎంతమాత్రమో. వెధవ కాన్వెంట్ చదవు, నువ్వును.
నన్ను ఇంతల అవమానిస్తావా. చూడు ఇప్పుడు నీ హెల్ప్ ఏమి తీసుకోకుండానే నేనే ట్రాన్స్లేట్ చేస్తాను. "సర్వే జన సుఖినో భవంతు"  ఇది సంస్కృతం కదా. చూడు నేను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. దీనికర్ధం.....!  ఆ తెలిసింది.  సర్వే చేసే జనాలందరూ సుఖంగా భవంతుల్లో ఉంటారు.

అదండీ సంగతి. 

8 comments:

  1. హహహ! నిజంగానే మీకు సంస్కృతం, తెలుగు ఇంత బాగా వచ్చనుకోలేదు ;)

    ReplyDelete
    Replies
    1. కదా! నేను చిన్నప్పటినుండి అంతేనండి. కామెంటినందుకు బోల్డు బోల్డు థాంకులు.

      Delete
  2. ooo.. chala baga cheparu swati garu.. meku nijamgane telugu inta baga vachu ani teledu.

    ReplyDelete
  3. సర్వే జన సుఖినో భవంతు" yee sarvey chesevaallallo nenuu unnaa kaanee..oka bhavanaanni ippinchammaa..sukham gaa bathukkuntaa....hahahah

    chaalaa chaalaa baagundi swaathi..keep it up

    ReplyDelete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. హ్హహ్హహ్హహ్హహ్హహ్హ
    "సర్వే జన సుఖినో భవంతు-
    ఇది సంస్కృతం కదా. చూడు నేను దీన్ని ట్రాన్స్లేట్ చేస్తాను. దీనికర్ధం.....! ఆ తెలిసింది. సర్వే చేసే జనాలందరూ సుఖంగా భవంతుల్లో ఉంటారు."....
    చాలా చాలా బావుంది.............

    ReplyDelete