Sunday, March 16, 2014

ఓ చిన్న కథ....


ఓ చిన్న కథ....


అదో అందమైన కాలనీ. అక్కడ నివాసముంటున్న ప్రజలందరూ ఎంతో కలసిమెలసి ఉంటున్నారు. వారితోపాటే ఆ పెద్ద మేడలోని వాళ్ళు కూడా అందరితో కలుపుగోలుగా ఉండేవారు. కాలం గడిచేకొద్దీ ఆ పెద్దమేడలోని వారు క్రమంగా కాలనీ వాసుల మధ్య చిన్న చిన్న గొడవలు పెట్టడం, వారిని మోసం చేయడం లాంటివి చేస్తూ కాలనీ ప్రజల యొక్క నమ్మకాన్ని కొద్ది కొద్దిగా పోగొట్టుకుంటూ వచ్చారు. ఒకానొక విపత్కర సమయంలో కాలనీ వాసులకు పూర్తిగా కుచ్చు టోపీ పెట్టేసి వారి నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకున్నారు. దాంతో కాలనీ వాసులందరూ ఆ ఇల్లు అస్సలు మంచిది కాదు అని, ఎవ్వరూ కూడా ఆ ఇంటి గడప తొక్కకూడదు అని, ఆ ఇంటి మీద కాకి కాలనీలో ఇంకే ఇంటి మీదా వాలనివ్వ కూడదు అని నిర్ణయించుకున్నారు.


ఆ పెద్ద మేడ వాళ్ళకు ఈ సంగతి అతి త్వరలోనే తెలిసిపోయింది. ఒకానొక రోజు పొద్దున్న ఆ ఇంటి పెద్ద కొడుకు ఆ ఇంటి నుండి బయటకు వచ్చి అదే వీధిలో వేరొక ఇంట్లో కాపురం పెట్టాడు. ఆ రొజు సాయంత్రం ఇంకో కొడుకు బయటకు వచ్చి ఇంకో ఇంట్లో కాపురం పెట్టాడు. అలా ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసి ఎదురిల్లు, పక్కిల్లు, వెనకిల్లు ఇలా వేరు వేరుగా కాపురాలు పెట్టేసారు.


పక్కరోజు పొద్దుటి నుండి మళ్ళి కాలనీ వాసులతో మాట్లాడ్డానికి ప్రయత్నం చేస్తూ వారు కూడా మిగిలిన వాళ్ళతో కలిసి ఆ ఇంటిని ఆడిపోసుకోడం మొదలుపెట్టారు. ఆ ఇల్లు చెడ్డది అంటున్నారు. ఆ ఇల్లు అందరినీ మోసం చేసింది అంటున్నారు. కాలనీ ప్రజలు ఎవ్వరూ ఆ ఇంటిని ఇంక నమ్మొద్దు అంటున్నారు.
-------------------------
ఇప్పుడు ఆ కాలనీ వాసులు ఎలా స్పందించాలి? ఆ ఇంటిని వెలివేయాలి అన్న వారిిమాటల్లోని అర్థం ఇటుకలు, సిమెంటు వేసి కట్టిన ఆ గోడల్ని వెలివేయాలి అనా లేక ఆ ఇంటిలోని వ్యక్తులనా??


కనీసం ఈ సంగతి కూడా గ్రహించలేని వాళ్ళను అమాయకులు అనుకోవాలా ?? లేక తాము ఏమి చేసినా చెల్లుతుంది, ప్రజలు వట్టి గొర్రెలు అనేది ఆ ఇంటివారి ఉద్దేశమా??
కాస్త ఈ ధర్మ సందేహాన్ని తీర్చండి ఎవరైనా..............!!!!!
--------------------------


అన్నట్టు ఈ కథలోని ఉద్దేశం అందరికీ బోధపడింది కదా......

5 comments:

  1. కథ బాగుందండీ :)

    ఆ కాలనీ వాసులను పెద్ద మేడ మోసం చేసింది అనే అనుకుంటున్నారు,
    కానీ వీరు మోసపోతున్నట్టు అర్థం చేసుకోలేదు, (ఇక్కడ మానవ సహజ సిద్దమైన ఇగో అడ్డమొస్తుందేమో అందుకే ఎదుటి వాడు మోసం చేసాడు అనే అంటారు, మోసపోయాం అనే బదులు:)

    కాలనీ వాసులంతా మేము మోసపోతున్నాం అని 'మూకుమ్మడిగా' అర్థం చేసుకున్నరోజు, ఎవరిని వెలి వేయాలి అన్న ప్రశ్న కి సమాధానం దొరుకుతుంది :)

    ReplyDelete
    Replies
    1. హర్ష గారు, అవునండి ప్రజలందరికి మోసపోతున్నాము అన్న realization త్వరలోనే రావాలి అని ఆశిద్దాం

      Delete
  2. సూపర్ అనాలజీ, కాలనీ వాసులందరికీ ఈ కథలోని ఉద్దేశం బోధపడింది :)) కికికి..

    ReplyDelete
  3. Very good Swati, Malli mosam cheyyadaniki janalalo kalisaru annamata

    ReplyDelete