Sunday, January 27, 2013

నారాయణ వనం !

నారాయణ వనం !  ఈ పేరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది కదా !  అయినా పర్లేదు, నేను చెప్పేది కూడా ఒకసారి వినేసేయండి. అబ్బా .... అదేనండి చదివేసేయండి.

తిరుపతికి 30 కి.మీ. దూరంలో ఉంది ఈ ఊరు. అప్పట్లో ఈ ఊరిని శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి గారైన ఆకాశ రాజు పరిపాలించే వారు.  తిరుమల కొండ మీద బస చేసిన స్వామివారు ఒకనాడు ఒక ఏనుగును వేటాడుతూ ఇక్కడికి వచ్చారు.  అప్పుడే అమ్మవారిని చూసారు. తన తల్లిగారైన వకుళమాత ద్వారా ఆకాశ రాజుని సంప్రదించి అమ్మవారిని వివాహమాడారు.  శ్రీ స్వామివారు, అమ్మవార్ల కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ నారాయణవనం.  ఇక్కడి సువిశాలమైన ఆలయ ప్రాంగణంలో స్వామివారు కళ్యాణ వేంకటేశ్వరునిగా వెలసి, భక్తులను దీవిస్తున్నారు.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వారందరూ వీలు చూసుకుని తప్పకుండా ఈ గుడిని దర్శించండి.  ఈ ఆలయ ప్రాంగణం సువిశాలంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి మూల విరాట్టు కుడి చేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమ చేతిలో వేట ఖడ్గం ధరించి ఉంటారు.  ప్రాంగణం లోపల పద్మం లో కుర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది.

 అంతే కాదండి ఇక్కడ మీరు అమ్మవారి కళ్యాణ సమయంలో నలుగు పిండి విసిరిన తిరగలిని కూడా  చూడొచ్చు. ఎంత పెద్దగా ఉంటుందో.

పెళ్లి కావలసిన అమ్మాయిలు, అబ్బాయిలు, లేదా వారి తల్లిదండ్రులు ఇక్కడి స్వామి అమ్మవార్లను దర్శించి ప్రార్ధిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంది అని ప్రతీతి.      (Please note this point your Honour)

నారాయణవనం లోనే  అవనాక్షమ్మ గుడి కూడా ఉంది. ఈవిడ శ్రీ పద్మావతి అమ్మవారి కుల దైవం. చాలా మహిమగల తల్లి. ఈ గుడి గురించి తరువాత చెప్తాను.

అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.

18 comments:

  1. ఇదే వినటం అండీ ఈ ఊరిపేరు..
    i noted that valuable point ;)

    ReplyDelete
    Replies
    1. రాజ్ కుమార్ గారు, మరి ప్రయాణం ఎప్పుడు?!!!!

      Delete
  2. మంచి వివరాలు అందించారండీ. ఇపుడు కూడా ఉందోలేదా మారిందో తెలీదు కానీ ఇక్కడ కొన్నేళ్ళక్రితం ప్రతి శనివారం కళ్యాణం జరిగేదండీ ఇంచుమించు తిరుమల కళ్యాణానికి ధీటుగా జరుగుతుంది ప్రసాదాలతో సహా. ఆ కళ్యాణం జరిపించినవాళ్లకి కూడా ఖచ్చితంగా వివాహమవుతుందని అంటారు.

    ReplyDelete
    Replies
    1. వేణు శ్రీకాంత్ గారు మీరు చెప్పింది నిజమేనండి.

      Delete
  3. Replies
    1. రహ్మాన్ గారు థాంక్యు అండి.

      Delete
  4. చాలా మంచి విషయాలు చెప్పావు స్వాతి.పనిలో పని నాగలాపురం గురించి కూడా వ్రాసేయ్యి

    ReplyDelete
  5. Nenu ikkadiki vellanandi okasari :) ikkada daggarlo edo satram lo 'rama phalam' chettu choosa! Seetaphalam laga annamata. Pallu eragaa untay :) andukani baga gurtundipoyindi ee ooru ee gudi :)

    ReplyDelete
    Replies
    1. రామాఫలం అంటే మాకు తెలుసులేమ్మా. బోడి :P

      Delete
  6. కూసింత లేటుగా తెలుసుకున్నా అన్నమాట

    ReplyDelete
  7. రాజ్, రహ్మానువంటి ఉత్సుకులైన బెమ్మీల కోసం ఇదివరకే బస్సు బుక్ చేసామండీ, ఏదీ కదిలితేగా సోలో లైఫే బాగుందట !
    నేను మాత్రం ఊరుకోనండీ.. ఈసారి తిరుపతి వచ్చినపుడు తప్పకుండా చూసేస్తా!

    ReplyDelete
    Replies
    1. నాగార్జున గారు, శుభస్య శీఘ్రం

      Delete
  8. ee temple choosam april 1st week lo kani ee peru enduko vachindo teliyaledu...thanks for the info.. naku mee blog nachindi so shared it on fb ...hope u dont mind...

    ReplyDelete
  9. still more points are there... akka

    ReplyDelete