Saturday, November 10, 2012

నన్నేల రావయ్య......

నన్నేలు నా దేవరా !
          నిన్నేల అర్చింతురా .......

నీకు మనసైన పూవులతో 
         పూజిన్తునంటే ...

అక్షర సుమాలతో మాలికలల్ల 
         నే కవయిత్రిని కానే.....

సుందర పదములు కుదురుగ కూర్చగ 
         నే స్వరకర్తను కాను  ........

మధుర కీర్తనలు గానము సేయగ 
          నే గాయినిని కాను ...

కనులకింపుగా నాట్యముసేయగా 
         నే నర్తకిని  కాను ........

నా దేవరా ...............

నా మనస్సే నీ కోవెలగ మలచినాను 
ఆత్మనే దివ్వెగా వెలిగించినాను ,
నీ చల్లని చూపు నాపైనిడవయ్య .......

నన్నేల రావయ్య నా దేవర !! 

6 comments:

  1. చాలా బాగా రాసారు స్వాతి గారు :)

    ReplyDelete
  2. చక్కగా రాసేసి కవయిత్రిని కానంటే ఎలా :)

    ReplyDelete
  3. తృష్ణ గారు, థాంక్యు.

    ReplyDelete