Saturday, October 6, 2012

అక్షర సుమాంజలి

కలలో పలుకరించావు,
          ఇలలో ఎదుటపడినావు  
స్నేహ హస్తం అందించావు
           ప్రేమనెంతో పంచావు
జీవితాన్ని గడుపుతున్న నాకు
           జీవించడం నేర్పావు 
కష్ట సుఖాలన్నింటిని 
           ఆస్వాదించడం నేర్పావు 
కన్నీరు తుడిచావు
            నవ్వుల్ని పంచావు
తల్లిలా లాలించావు
            తండ్రిలా నమ్మకాన్ని నింపావు
గురువువై హిత బోధలెన్నో చేసావు
            నీవే నా దైవమై నిలిచావు
ప్రాణం లో ప్రాణమైనావు 
           నీవే నా ఊపిరైనావు 
నీ భావాలే
           నాకు మార్గదర్సకాలు
నీ వాక్కులే
          నాకు స్పూర్తిదాయకం
నేస్తమా,

నీవందించిన స్పూర్తి
         నా వెంట వుండగా
అధైర్యమన్నది ఏనాడు 
         నా దరికి చేరలేదు 

15 comments:

  1. maa akkaki thammidini kabatti..naadhee adhe comment...

    ReplyDelete
  2. yeah, as the little sister of my cousins - i think it was well written and also indicative of how inspired you are. Naaku easy ga ardham ayyelaaga undi, without any confusion.

    ReplyDelete
  3. @ aparna
    Thank u akka;

    @skvramesh garu, thank u andi;

    @bharadwaj
    thank u annayya;

    @visali thank u

    ReplyDelete
  4. స్వాతి గారు,
    నిజమైన శ్రద్ధాంజలి అనిపిస్తున్నది.

    ReplyDelete
  5. Great to see here ! Very nice ,
    Hope you are doing well.

    ReplyDelete
  6. స్వాతి గారు, బాగున్నారా? బాగా వ్రాశారు.

    ReplyDelete
  7. >>>నీవందించిన స్పూర్తి నా వెంట వుండగా
    అధైర్యమన్నది ఏనాడు నా దరికి చేరలేదు<<<

    ఎప్పటికీ చేరలేదండీ. మీ మొదటి పోస్ట్ చూసినట్టున్నాను. మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను. ఇక నుండి మీ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతాను.

    ReplyDelete
  8. శిశిర గారు, ధన్యవాదాలండి

    ReplyDelete
  9. మీకు బ్లాగు ఉందా !! అదీ 2010 నుండీ!! నాకసలు తెలీనే తెలీదు సుమండీ!! బాగా రాసారు.

    ReplyDelete